అపార్టుమెంట్ల బిల్లుపై గవర్నర్‌ సందేహాలు | - | Sakshi
Sakshi News home page

అపార్టుమెంట్ల బిల్లుపై గవర్నర్‌ సందేహాలు

Sep 11 2026 10:51 AM | Updated on Sep 11 2026 10:51 AM

శివాజీనగర: సీఎం డీకే శివకుమార్‌ తీసుకువచ్చిన కర్ణాటక అపార్టుమెంటు యాజమాన్య మరియు నిర్వహణ చట్టం బిల్లు– 2026 కు లోక్‌భవన్‌లో బ్రేక్‌ పడింది. బిల్లులో కొన్ని నిబంధనలపై స్పష్టత కోరుతూ గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌ పెండింగ్‌లో పెట్టారు. ఆగస్టు 24న శాసనసభా ఈ బిల్లును ఆమోదించింది. రాష్ట్రంలోని అపార్ట్‌మెంట్‌ నివాసితుల హక్కులు, నిర్వహణలో అనేక మార్పులు తీసుకొచ్చింది. వాటిలోని లిప్టులు, కారిడార్లు, లాబీలు, మెట్లు, టెర్రస్‌ల వంటి ఉమ్మడి సౌకర్యాలు ఒక నిర్దిష్ట సంఘం నియంత్రణలో కాకుండా సమిష్టిగా ఉండాలని ప్రతిపాదిస్తుంది. నివాసితుల భద్రత దృష్ట్యా 30 ఏళ్లు పూర్తయిన భవనాలకు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి నిర్మాణ స్థిరత్వ ధృవీకరణ పత్రాన్ని పొందడం తప్పనిసరి చేశారు. 75 శాతం అపార్ట్‌మెంట్‌ యజమానులు కూడా ఈ బిల్లుపై సంతృప్తి వ్యక్తంచేశారు. ఈ చట్టం ఎనిమిది యూనిట్లకు మించిన అన్ని గృహ నిర్మాణ ప్రాజెక్టులకు వర్తిస్తుంది. అపార్టుమెంట్ల ఇబ్బందులకు పట్టణాభివృద్ధి శాఖ ఆధ్యర్యంలో ప్రత్యేక వివాద పరిష్కార యంత్రాంగాన్ని రూపొందించారు.

చెలరేగిన దొంగలు,

రూ.42 లక్షల సొత్తు చోరీ

మైసూరు: మైసూరు తాలూకాలోని రెండు గ్రామాల్లో దొంగలు స్వైర విహారం చేశారు. పలు ఇళ్లలో తాళాలు పగులగొట్టి రూ.42 లక్షల విలువ చేసే 384 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.1.45 లక్షల నగదును దోచుకున్నారు. మొదటి ఘటనలో రమాబాయినగర ఆర్‌కే బడావణె నివాసి దీపక్‌ భార్య సువర్ణాదేవి ఇంటికి తాళం వేసుకుని మైసూరుకు వెళ్లారు. దొంగలు చొరబడి ఇంట్లో వార్డ్‌రోబ్‌లో దాచిన రూ.41.13 లక్షల విలువైన 340 గ్రాముల బంగారు నగలు, రూ.1.35 లక్షల నగదు, 88 గ్రాముల వెండి వస్తువులను దోచుకుని పరారయ్యారు. సువర్ణాదేవి ఇంటికి వచ్చి చూడగా దొంగతనం తెలిసింది. రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

నిద్రిస్తుండగా గొలుసు కట్‌

మరో ఘటనలో యడకోళలో ఇంటి గడియను తెరిచిన దుండగులు నిద్రిస్తున్న దేవమ్మ మెడలోని 34 గ్రాముల బంగారు గొలుసును కత్తిరించుకుని వెళ్లారు. ఉదయం నిద్ర లేచి చూసుకుంటే గొలుసు లేదు. వరుణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

ప్రియుని మౌనం..

వివాహిత ఆత్మహత్య

దొడ్డబళ్లాపురం: ప్రియుడు ఫోన్‌ చేయడం లేదు, ఆమె కాల్‌ చేసినా స్పందించడం లేదు.. దీంతో బాధకు లోనై ఇద్దరు పిల్లల తల్లి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బాగలకోటలోని బాంబే కాలనీలో జరిగింది. మొబైల్‌ సంబంధాల మాయలో తరిగిపోతున్న కుటుంబ బాంధవ్యాలకు ఈ సంఘటన ప్రతిబింబిస్తోంది. వివరాలు.. మెహబూబ్‌ బీ (27) మృతురాలు. ఈమె స్థానికంగా ఉంటున్న ఒక యువకునితో సంబంధం కలిగి ఉంది. కొన్నిరోజులుగా అతడు ఈమెకు కాల్‌ చేయకపోగా, ఈమె ఫోన్‌ చేస్తే మాట్లాడడం లేదు. దీంతో మెహబూబ్‌ బీ సెల్ఫీ వీడియో తీసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని అతనికి పంపింది. నాతో మాట్లాడకపోతే నీ పేరు రాసి ఆత్మహత్య చేసుకుంటానని వాట్సాప్‌ మెసేజ్‌ కూడా పంపింది. అయినప్పటికీ అతడు పట్టించుకోలేదు. విరక్తి చెందిన మెహబూబ్‌ బీ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నవనగర పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement