విద్యార్థులకు ఉత్తమ బోధన అవసరం | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు ఉత్తమ బోధన అవసరం

Sep 10 2026 12:03 AM | Updated on Sep 10 2026 12:03 AM

రాయచూరు రూరల్‌: పాఠశాలల్లో ప్రాథమిక విద్య స్థాయిలో ఉపాధ్యాయులు విద్యార్థులకు ఉత్తమ బోధన చేయాలని మంగళవారపేట మఠాదిపతి వీర సంగమేశ్వర శివాచార్య స్వామీజీ పేర్కోన్నారు. బుధవారం నగరంలోని మంజునాథ్‌ విద్యా సంస్థ ట్రస్ట్‌ ఎంఎం కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులకు జ్ఞానాన్ని పెంచడానికి ఆధునిక ఉపకరణాలతో బోధించడం మేలన్నారు. విద్యతో పాటు సంస్కారం, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతలను గురించి వివరించాలన్నారు. ఆదనగౌడ, నరసింహ నాయక్‌, సిద్దప్ప, మంజునాథ్‌, లక్ష్మి దళపతి, సునీల్‌, శరణ బసవ పాటిల్‌, వీరేష్‌ నాయక్‌లున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement