హొసపేటె: భ్రూణలింగ నిర్ధారణ చట్టరీత్యా నేరం అని జిల్లా మిషన్ శక్తి కో–ఆర్డినేటర్ విద్యా పేర్కొన్నారు. ఆమె విజయనగర జిల్లా హరపనహళ్లి తాలూకా ఆరోగ్య అధికారి కార్యాలయ హాలులో పీసీపీఎన్‌డీటీ చట్టం–1994పై ఏర్పాటు చేసిన అవగాహన, శిక్షణా సదస్సులో మాట్లాడారు. పీసీపీఎన్‌డీటీ చట్టం ఉద్దేశ్యం, భ్రూణహత్యల నివారణలో ప్రాముఖ్యత, ఆడపిల్లలను రక్షించాల్సిన అవశ్యకత, వారికి సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరం గురించి వివరించారు. హరపనహళ్లి బాలల అభివృద్ధి ప్రాజెక్ట్ అధికారి రామన గౌడ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. బాలికల సంఖ్య తగ్గిపోకుండా నివారించడానికి సమాజంలో అవగాహన కల్పించడం, బాలికలపై సామాజిక వైఖరిలో మార్పు తేవడం గురించి విశ్లేషించారు. జిల్లా కుటుంబ సంక్షేమ అధికారి వినయ్, సీనియర్ హెల్త్ ఇన్‌స్పెక్టర్ ధర్మనగౌడ, జిల్లా ఆరోగ్య విద్యా అధికారి దొడ్డమని, తాలూకా ఆరోగ్య అధికారి డాక్టర్ అరవింద్, సీనియర్ సూపర్‌వైజర్లు, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.


