బొమ్మనహళ్లి: బెంగళూరు శివార్లలో ఆనేకల్ పట్టణంలోని తిమ్మరాయస్వామి ఆలయ ప్రాంగణంలో కొత్తగా నిర్మించిన కోనేరును అటవీ శాఖ మంత్రి రామలింగారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కనులపండువగా తెప్పోత్సవాన్ని నిర్వహించారు. అనేక సంవత్సరాల క్రితం ఆలయ ప్రాంగణంలో ఒక కోనేరు ఉండేది. కానీ పట్టణీకరణలో అది కనుమరుగైంది. భక్తులు, ఆలయ నిర్వాహకులు కలిసి పుష్కరిణిని పునరుద్ధరించారు. తిమ్మరాయస్వామికి ప్రత్యేక అలంకరణలు, పూజలు నిర్వహించారు.
జీర్ణోద్ధరణ చేసిన పుష్కరిణిలో తెప్పోత్సవం


