రాయచూరు రూరల్: బీజేపీ నాయకులు చేస్తున్న పాదయాత్రతో ఒరిగింది ఏమీ లేదు. వర్షాభావంతో రాష్ట్రంలో కరువు ఛాయలు అలుముకున్నాయి. రైతులకు అందించాల్సిన పరిహారం నోరు విప్పాలని రాష్ట్ర నగరాభివృద్ధి శాఖ మంత్రి యతీంద్ర సిద్దరామయ్య సూచించారు. ఆదివారం ఆయన రాయచూరులో విలేకరులతో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌తో చర్చించి కరువు పరిహారంపై అందించేందుకు చొరవ తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు, కస్తూరి రంగన్ నివేదికలపై చర్చింకుండా విధాన సభలో సమయాన్ని వృథా చేశారని ఆరోపించారు. పంటలు వేసి నష్టపోయిన రైతులకు పరిహారం వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. గత ఏడాది కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన రూ.39 వేల కోట్లను సుప్రీం కోర్టు చివాట్లు పెడితే మంజూరు చేశారన్నారు. ఈ ఏడాది కూడా అలాగే చేస్తే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో శాసన సభ్యులు బోసురాజ్, నాగవేణి పాటిల్, శాలం తదితరులు పాల్గొన్నారు.


