మండ్య: చివరి శ్రావణ శనివారం సందర్భంగా అంతటా వైష్ణవ దేవాలయాల్లో విశేష పూజలు జరిగాయి. ఆలయాలకు నెలవైన మండ్య తాలూకాలోని కొమ్మేరహళ్లి నరసింహస్వామి ఆలయాన్ని శుక్రవారం రాత్రి నుంచే పచ్చని తోరణాలు, రకరకాల పూలతో అలంకరించారు.
● ఏకశిలా స్తంభపు నరసింహస్వామికి మహారాజుగా అలంకరించారు.
● హనియంబాడి రోడ్డులోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఉదయం 10 గంటల నుంచే భక్తాదులకు అన్నసంతర్పణ ఏర్పాటు చేశారు.
● మండ్య నగరంలోని ప్రముఖ ఆలయాలైన లక్ష్మీ జనార్ధనస్వామి ఆలయం, శ్రీనివాస ఆలయం, హొసహళ్లి బడావణె శ్రీనివాస ఆలయం, బోవి కాలనీ శ్రీలక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయం, నగరంలోని మైసూరు–బెంగళూరు రహదారిలో కల్లహళ్లి ఆంజనేయ స్వామి దేవస్థానాల్లో శ్రావణశోభ ఉట్టిపడింది. దేవీదేవతలను దర్శించుకుని భక్తజనం పునీతులయ్యారు.
● మద్దూరు, మళవళ్లి, కేఆర్ పేటె, నాగమంగల, శ్రీరంగపట్టణ, పాండవపుర తాలూకాల్లోని విష్ణు ఆలయాల్లో పూజలు జరిగాయి.
● మేలుకోటె, శ్రీరంగపట్టణ, కేఆర్‌పేటె భూవరహనాథ స్వామి ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి పూజలు సమర్పించారు.
అగరలో
బొమ్మనహళ్లి: నగరంలోని బొమ్మనహళ్ళిలోని అగరలో శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయుంలో శనివారం విశేష పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున పంచామృతాలతో అభిషేకం నిర్వహించి అలంకారం తరువాత భక్తులకు దర్శనం కల్పించారు.
భక్తిశ్రద్ధలతో చివరి
శ్రావణ శనివార పూజలు
వైష్ణవ ఆలయాల్లో భక్తకోటి


