బాధిత కుటుంబాలను ఆదుకుంటాం | - | Sakshi
Sakshi News home page

బాధిత కుటుంబాలను ఆదుకుంటాం

Sep 5 2026 5:37 AM | Updated on Sep 5 2026 5:37 AM

రాయచూరు రూరల్‌: జిల్లాలో మృతి చెందిన దళిత కుటుంబాలకు పరిహారం అందిస్తాం. సర్కార్‌ ఉద్యోగం ఇచ్చేందుకు ప్రతిపాదనలను పరిశీలించడం జరుగుతుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మునియప్ప పేర్కొన్నారు. శుక్రవారం దేవదుర్గ తాలూకాలో పర్యటించారు. హద్దినాళలో భూమానంద, కరడకల్లలో రేణుక, సిరవార తాలుకా హోక్రాణిలో అశ్విని కుటుంబ సభ్యులను పరామర్శించారు. సర్కార్‌ నుంచి బాధిత కుటుంబాలకు త్వరగా పరిహారం అందేలా చొరవ తీసుకుంటామన్నారు. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారి, పోలీస్‌ యంత్రాంగాన్ని ఆదేశించారు. విద్యార్థులు చదువుకునేందుకు హాస్టల్‌ సౌలభ్యం కల్పిండచం జరుగుతుందన్నారు. గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో శౌచాలయాలు, మరుగుదొడ్ల నిర్మాణాలకు ప్రాధాన్యత కల్పించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో విధాన పరిషత్‌ సభ్యుడు బోసురాజ్‌, ఎమ్మెల్యేలు హంపయ్య నాయక్‌, కరెమ్మ నాయక్‌. జిల్లా అధికారి పూవిత, ఏడీసీ శివానంద, అసిస్టెంట్‌ కమిషనర్‌ హంపణ్ణ, ఎస్పీ అరుణాంగ్శు గిరి, సిరవార తహసీల్దార్‌ చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement