త్వరలో వాల్మీకి విగ్రహ ప్రతిష్ఠాపన | - | Sakshi
Sakshi News home page

త్వరలో వాల్మీకి విగ్రహ ప్రతిష్ఠాపన

Sep 5 2026 5:37 AM | Updated on Sep 5 2026 5:37 AM

బళ్లారి రూరల్‌: వివిధ కారణాలతో నగరంలోని ఎస్పీ సర్కిల్‌ వద్ద మహర్షి వాల్మీకి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం 8 నెలలుగా వాయిదా పడింది. ఎట్టకేలకు మంత్రిమండలిలో ఆమోదం లభించడంతో త్వరలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించనున్నట్లు వాల్మీకి విద్యాభివృద్ధి సంఘం ఉపాధ్యక్షుడు జయరాం తెలిపారు. శుక్రవారం పత్రికా భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మహర్షి వాల్మీకి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం వైభవంగా నిర్వహిస్తామని వెల్లడించారు. మంత్రి మండలిలో ఆయోదం తెలిపినందుకు ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు ధన్యవాదాలు తెలిపారు. మహర్షి వాల్మీకి కేవలం ఒక వర్గానికి చెందిన వాడు కాదని.. రామాయణం రచించిన ఆదికవిగా గుర్తించాలని అన్ని పార్టీల నాయకులు, ప్రముఖులకు సూచించారు. విగ్రహాన్ని నగర ఎమ్మెల్యే నారాభరత్‌రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. నాయకులందరూ కలిసి చర్చించుకుని విగ్రహ ప్రతిష్ఠాపన నిర్వహణ తేదీని నిర్ణయించాలని పేర్కొన్నారు. సమావేశంలో వాల్మీకి సముదాయ ప్రముఖులు వీ.కే.బసప్ప, ముదిమల్లయ్య, రుద్రప్ప, లోకేశ్‌, జనార్దన పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement