హోటళ్లలో ఆహార తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

హోటళ్లలో ఆహార తనిఖీలు

Sep 4 2026 7:53 AM | Updated on Sep 4 2026 7:53 AM

శివమొగ్గ: శివమొగ్గ నగరంలోని హోటళ్లు, బేకరీలు, ప్రభుత్వ హాస్టళ్లలో ఆహార నాణ్యత తనిఖీలు కొనసాగుతున్నాయి. సహాయక కలెక్టర్‌ డాక్టర్‌ మైత్రి నేతృత్వంలో అధికారులు మంగళవారం నగరంలోని పలు ఫుడ్‌ కోర్టులలో సోదాలు చేశారు. ఆహార తయారీలో నాణ్యతను పాటించాలని, నాసిరకం, హానికరమైన, నిషేధిత రసాయనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదని నిర్వాహకులకు సూచించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని, శుభ్రమైన వంట నూనెను ఉపయోగించాలని పలు సూచనలు చేశారు. ఆహార నాణ్యతను తనిఖీ చేయడంతో పాటు, నిబంధనలు పాటిస్తున్నారా లేదా అని కూడా పరిశీలిస్తున్నట్లు, కలెక్టర్‌కు నివేదిక అందిస్తామని మైత్రి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement