శివాజీనగర: పంచాయితీరాజ్ శాఖ ఇంజనీర్ల ఉద్యోగాలు, కేపీఎస్‌సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ మంగళవారం జేడీఎస్ నాయకులు, కార్యకర్తలు బెంగళూరులో క్వీన్స్ రోడ్డులో కేపీసీసీ ఆఫీసు ముట్టడికి యత్నించారు. మాజీ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాస్‌మూర్తి నేతృత్వంలో ధర్నా చేశారు. పోలీసులు వారిని అడ్డుకుని అక్కడి నుంచి తరలించారు.
మరోవైపు ఎమ్మెల్సీ శరవణ ఆధ్వర్యంలో కేపీఎస్‌సీ వద్ద ధర్నాకు దిగారు. పోలీసులు అడ్డుకోగా వాగ్వివాదం నెలకొంది. శరవణ, కార్యర్తలు రోడ్డు మధ్యలోనే కూర్చొని ధర్నా చేయగా పోలీసులు వారిని వాహనాల్లో తరలించారు. మరోవైపు రాహుల్‌గాంధీపై కేంద్ర ప్రభుత్వం కేసులు పెట్టడాన్ని ఖండిస్తూ పెద్దసంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు కేంద్రం దిష్టిబొమ్మను దహనం చేశారు.


