సాక్షి,బళ్లారి: గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఇంటి ముంగిటకే వైద్య సేవలు అందించడం హర్షణీయమని సండూరు ఎమ్మెల్యే అన్నపూర్ణ తుకారాం పేర్కొన్నారు. ఆమె గురువారం జేఎస్‌డబ్ల్యూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2026–27వ సంవత్సరానికి సంబంఽధించి మొబైల్ హెల్త్ యూనిట్లను ప్రారంభించి మాట్లాడారు. గ్రామీణ ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండేలా ప్రాథమిక వైద్య సేవలను అందించేందుకు కృషి చేస్తుండటం ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న వరం అన్నారు. క్యాలెండర్‌ను, మొబైల్ హెల్త్ యూనిట్ల సేవలను ప్రారంభించారు. ఇంటి వద్దకే మొబైల్ వాహనాలు వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలన్నారు. బీపీ, షుగర్, జ్వరం, దగ్గు, జలుబు తదితరాలకు అక్కడికక్కడే వైద్యం చేసి మందులు అందజేస్తారన్నారు. జేఎస్‌డబ్ల్యూ దక్షిణ భారత ప్రముఖుడు పెద్దన్న బీదల మాట్లాడుతూ సండూరు ప్రాంతంలో మొబైల్ హెల్త్ యూనిట్ల కోసం దాదాపు రూ.1.50 కోట్లు ఖర్చు చేస్తున్నారన్నారు. హెల్త్ యూనిట్‌లో వైద్యుడు, ఫార్మసిస్టు, పేషెంట్ అసిస్టెంట్‌తో పాటు అన్ని విధాలుగా చూసుకునేందుకు ఏర్పాట్లు చేశారన్నారు. వృద్ధులు, చిన్నారులు, పేదలకు ఎంతో ఉపయోగపడుతుందని గుర్తు చేశారు. నిరంతరంగా ఇంటి ముంగిటకే వైద్య సేవలు అందించే చర్యలను జిందాల్ సంస్థ తీసుకుందన్నారు. జిందాల్ సంస్థ ప్రముఖులు మయూరేష్, కిరణ్ గోవింద్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
సండూరు ఎమ్మెల్యే అన్నపూర్ణ తుకారాం


