భూమినిచ్చే రైతులను కాపాడుతాం | - | Sakshi
Sakshi News home page

భూమినిచ్చే రైతులను కాపాడుతాం

Sep 1 2026 3:00 AM | Updated on Sep 1 2026 3:00 AM

బనశంకరి: ‘నేను ఒక రైతు కుమారున్ని, భూమి కోల్పోతే ఏమిటో నాకు బాగా తెలుసు. బాధిత రైతులు రుణం తీర్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది’ సీఎం డీకే.శివకుమార్‌ తెలిపారు. సోమవారం డాక్టర్‌ కే.శివరామ కారంత్‌ లేఔట్‌ కోసం భూములు ఇచ్చిన యజమానులకు పరిహారం అందజేత కార్యక్రమంలో సీఎం పాల్గొని మాట్లాడారు. భూమి ఇచ్చిన రైతులు సేవ ప్రభుత్వం ఎప్పటికీ మర్చిపోదని, వారి త్యాగం చాలా పెద్దది, వారి హక్కులను కాపాడటం తమ బాధ్యత అన్నారు. కారంత్‌ లేఔట్‌ ఏళ్లుగా కోర్టుల్లో నలుగుతోందన్నారు. అర్హులైన భూ యజమానుల హక్కులను కాపాడే పని తమ ప్రభుత్వం చేసిందన్నారు. కారంత్‌ లేఔట్‌లో 24,714 స్థలాల్లో 18,399 స్థలాలను రైతులు, భూయజమానులకు అందించామన్నారు. 3,500 రెవెన్యూ సైట్లు, 2,815 సైట్లను ప్రజలకు కేటాయిస్తామని తెలిపారు. కెంగల్‌ హనుమంతయ్య కాలంలో 60 లక్షలు ఉన్న బెంగళూరు జనాభా నేడు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల నుంచి ప్రజలు వచ్చి స్థిరపడటంతో కోటికి పైగా చేరిందని చెప్పారు.

సీఎం డీకే శివకుమార్‌

కారంత్‌ లేఔట్‌ భూయజమానులకు

పరిహారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement