శ్రీనివాసపురం: శ్రీనివాసన్ జయంతిని పురస్కరించుకుని పట్టణంలోని అంబేడ్కర్ ఉద్యానవనంలో ప్రతిభావంత విద్యార్థులకు పురస్కారాలు అందజేశారు. ఎం.శ్రీనివాసన్ గెళెయర బళగ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సాహితి కోటిగానహళ్లి రామయ్య మాట్లాడారు. శ్రీనివాసన్ హత్యను రాజకీయ హత్యగా పరిగణించకపోవడం విషాదకరమన్నారు. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడాల్సి వస్తే జ్ఞాన సంపాదన చేయాలని సూచించారు. విద్య వ్యాపారంగా మారడంతో జ్ఞానార్జన కూడా పెద్ద సవాలుగా మారిందని తెలిపారు. ఆర్‌పీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎం.వెంకట స్వామి మాట్లాడుతూ.. ఎం.శ్రీనివాసన్ అన్ని సముదాయాల వారికి అత్యంత ప్రీతి పాత్రుడు అయ్యారని కొనియాడారు. ప్రతిభావంత విద్యార్థులను గుర్తించి ప్రతిభా పురస్కారాలను అందించడం సంతోషించదగిన విషయమన్నారు. కార్యక్రమంలో డాక్టర్ శశికళ, తూపల్లి ఆర్.నారాయణ స్వామి, దింబాల అశోక్, కె.కె.మంజునాథ రెడ్డి, మ్యాకల నారాయణ స్వామి తదితరులు పాల్గొన్నారు.


