కారు– బైక్‌ ఢీ, ముగ్గురు బాలలకు గాయాలు | - | Sakshi
Sakshi News home page

కారు– బైక్‌ ఢీ, ముగ్గురు బాలలకు గాయాలు

Aug 24 2026 7:33 AM | Updated on Aug 24 2026 7:33 AM

చింతామణి: కారు–బైకును ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మైనర్లు తీవ్రంగా గాయపడ్డారు. చింతామణి రూరల్‌ పోలీసు స్టేషన్‌ పరిదిలోని శ్రీనివాసపురం రోడ్డు మారుతినగర దగ్గర శనివారం పొద్దుపోయాక జరిగింది. వివరాలు.. చింతామణి నుంచి బైకులో నాగసంద్రగడ్డ గ్రామానికి చెందిన విజయ్‌, వరుణ్‌ (15), పాతకోటవాసి భాస్కర (15)లు బూరగమాకలహళ్లిలోని పెళ్లికి వెళుతున్నారు. ఎదురుగా కారువచ్చి ఢీకొంది. బైక్‌ నుజ్జు నుజ్జుయింది. కారు ముందుభాగం ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో బాలలు ముగ్గురికీ కాళ్లు విరిగి పడిపోయారు. కొందరు చూసి చింతామణి ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు ప్రథమ చికిత్స చేసి బెంగళూరుకు తరలించాలని తెలిపారు. మైనర్ల బైక్‌ డ్రైవింగ్‌లతో ప్రమాదాలు అధికమయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement