మైసూరు: ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో అధిక లాభాలు వస్తాయని వయోవృద్ధున్ని నమ్మించి సుమారు రూ. 48.50 లక్షలను మోసం చేశారు. మైసూరు లలితా మహల్ నగర నివాసి (79), మొబైల్‌ఫోన్‌కి హెచ్‌డీఎఫ్‌సీ సెక్యురిటీస్ అనే పేరు గల వాట్సాప్ గ్రూపులో చేర్చుకున్నారు. తమ ద్వారా షేర్ల వ్యాపారం చేస్తే ఇబ్బడి ముబ్బడిగా లాభాలు వస్తాయని అందులో మెసేజ్‌లు వచ్చేది. ఇదినమ్మిన ఆయన దరఖాస్తులో వ్యక్తిగత వివరాలు నింపి, ఆ తర్వాత మోసగాళ్లు చెప్పిన వివిధ ఖాతాలకు దశలవారీగా రూ. 48.50 లక్షలను పంపించాడు. కొన్నాళ్లకు డబ్బులు డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా రూపాయి కూడా దొరకలేదు. ఆ వైపు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మోసపోయానని గ్రహించి సైబర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కష్టపడి సంపాదించుకున్న సొమ్మును అమాయకత్వం, అత్యాశ వల్ల నష్టపోయాడు.


