ప్రియునితో కలిసి భర్త హత్య | - | Sakshi
Sakshi News home page

ప్రియునితో కలిసి భర్త హత్య

Aug 20 2026 3:40 AM | Updated on Aug 20 2026 3:40 AM

దావణగెరె జిల్లాలో ఘోరం

దొడ్డబళ్లాపురం: ప్రియుని మోజులో పడిన వివాహిత కట్టుకున్న భర్తను హతమార్చింది. రాష్ట్రంలో నిత్యం ఏదో ఓచోట ఇలాంటి దుష్కృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ఘటన దావణగెరె తాలూకా పామేనహళ్లి గ్రామంలో వెలుగుచూసింది. రఘు (36), భార్య శృతి (30)కి 12 ఏళ్ల కిందట పెళ్లయింది. ఇద్దరూ కూలిపనులు చేసుకునేవారు. రఘు మద్యానికి బానిస కావడంతో ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. శృతికి రెండేళ్ల క్రితం ఒబేదుల్లాతో అక్రమ సంబంధం ఏర్పడింది. రఘు అడ్డుగా ఉన్నాడని భావించిన శృతి, ఒబేదుల్లాతో కలిసి హత్య చేసి మృతదేహాన్ని దగ్గరలోని తుంగభద్ర నదిలో పారవేశారు. వీరికి సురేశ్‌ అనే వ్యక్తి సహకరించినట్టు పోలీసులు తెలిపారు. శృతి, ఒబేదుల్లాను అరెస్టు చేసి సురేశ్‌ కోసం గాలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement