చిత్రలేఖనం రసరమ్యం | - | Sakshi
Sakshi News home page

చిత్రలేఖనం రసరమ్యం

Aug 20 2026 3:40 AM | Updated on Aug 20 2026 3:40 AM

బనశంకరి: సుందరమైన చిత్రలేఖనాలను చూస్తుంటే మనసు కళాత్మకతలో విలీనమవుతుంది. సిలికాన్‌ సిటీలో మదిదోచే చిత్రలేఖనాల ప్రదర్శన ఆరంభమైంది. బసవనగుడి బీపీ. ఒడియార్‌ రోడ్డులోని ఇండియన్‌ ఇన్సిటిట్యూట్‌ ఆఫ్‌ వరల్డ్‌ కల్చర్‌ గ్యాలరీలో ఆర్టిస్ట్‌ కే.మాల్యాద్రి ఆధ్వర్యంలో స్ట్రోక్స్‌ ఆఫ్‌ డ్రీమ్స్‌ పేరుతో పెయింటింగ్స్‌ అలరిస్తున్నాయి. ప్రముఖ చిత్రకారులు సంజయ్‌ చాప్లోకర్‌, సోఫియా హయాత్‌ ప్రారంభించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 18 మంది కళాకారులు గీసిన నవ్యమైన పెయింటింగ్స్‌ను ఇక్కడ చూడవచ్చు. ప్రకృతి పర్యావరణం, పల్లె జీవితం, దేవతలు, పక్షులు, వన్యజీవుల తదితరాల చిత్రలేఖనాలు హృద్యంగా ఉన్నాయి. ఎక్కువమంది మహిళా చిత్రకారులు పాల్గొనడం విశేషం. ఈ ప్రదర్శన 23వ తేదీ వరకు జరుగుతుందని తెలిపారు.

ఉద్యాననగరిలో పెయింటింగ్స్‌ షో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement