హుబ్లీ: వాయువ్య కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ బస్సు యాక్సిల్ కట్ కాగా బస్సు అదుపు తప్పి గోతిలోకి పడటంతో ఓ మహిళ మృతి చెందిన ఘటన ధార్వాడ శివారులో చోటు చేసుంది. మృతురాలిని హుస్సేన్ బీ కెంగనూరుగా గుర్తించారు. ఘటనలో బస్సు డ్రైవర్‌తో పాటు 15 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. వీరంతా జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో తీవ్రంగా గాయపడిన మునవళ్లి గ్రామానికి చెందిన హుస్సేన్ బీ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ బస్సు దావణగెరె నుంచి మీరజ్ వైపు వెళుతోంది. ఈ క్రమంలో యాక్సిల్ కట్ కావడంతో అదుపు తప్పి గోతిలోకి పడింది. తక్షణమే ప్రయాణికులు 108కు సమాచారం అందించారు. స్థలానికి వచ్చిన అంబులెన్స్ సిబ్బంది క్షతగాత్రులను ధార్వాడ జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. ఘటనపై ధార్వాడ గ్రామీణ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
ప్రమాదంలో ఓ మహిళ మృతి


