వీధి కుక్కల బెడద నివారించండి | - | Sakshi
Sakshi News home page

వీధి కుక్కల బెడద నివారించండి

Jul 23 2026 1:54 AM | Updated on Jul 23 2026 1:54 AM

రాయచూరు రూరల్‌: వీధి కుక్కల బెడద నివారణకు అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లాధికారిణి పూవిత సూచించారు. మంగళవారం తన కార్యాలయంలో అధికారులతో జరిగిన సమావేశానికి ఆమె అధ్యక్షత వహించి మాట్లాడారు. సింధనూరు, మాన్వి, రాయచూరు తాలూకాలతో పాటు నగర ప్రాంతాల్లో వీధి కుక్కల స్వైర విహారం అధికమైందన్నారు. జిల్లాలో ఇప్పటికే 300 మంది చిన్నారులు గాయపడటంపై విచారం వ్యక్తం చేశారు. సమావేశంలో ఏఎస్పీ హరీష్‌, జెడ్పీ సీఈఓ ఈశ్వర్‌ కుమార్‌, నగరసభ కమిషనర్‌ జుబీన్‌ మహాపాత్రో, అధికారులు నందిత, ఓం సింగ్‌, ఏసీ హంపణ్ణ, టీపీ ఈఓ చంద్రశేఖర్‌, తిమ్మప్ప, సురేష్‌ వర్మలున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement