● హలసూరులో నేత్రపర్వంగా పల్లకీ ఉత్సవం
బెంగళూరు నడిబొడ్డున హలసూరులో ఆదివారం పూల పల్లకీ ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. వైవిధ్య దేవీ దేవతల రూపాలలో మల్లెలు, ఇతర పుష్పాలతో పల్లకీలను అలంకరించి వాహనాలలో పురవీధుల్లో ఊరేగించారు. సోమేశ్వర ఆలయం, కామాక్షమ్మ ఆలయాల నుంచి బయల్దేరిన పదుల సంఖ్యలోని పూల పల్లకీల వైభవాన్ని చూడడానికి ప్రజలు రోడ్లకు ఇరువైపులా బారులు తీరారు. స్థానిక సంఘాలు, భక్తులు వారం రోజుల నుంచి పూల పల్లకీల తయారీలో నిమగ్నమయ్యారు. టన్నుల కొద్దీ పుష్పాలను ఇందుకు ఉపయోగించారు. సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకూ పల్లకీ జాతర కనువిందు చేసింది. ప్రతి ఏటా ఏప్రిల్‌లో ఈ వేడుకను జరపడం సంప్రదాయంగా వస్తోంది. – బనశంకరి:


