శివాజీనగర: మత్తు పదార్థాలు వాడుతున్నారని తరచూ ఆరోపణలు రావడంతో రాష్ట్రంలో అన్ని జిల్లాల జైళ్లల్లో ఖైదీలకు డ్రగ్స్ పరీక్షలు ప్రారంభించారు. ఈ పరీక్షల్లో మహిళా ఖైదీలు కూడా ఎక్కువగా మత్తు పదార్థాలను తీసుకుంటున్నట్లు వెల్లడి అయ్యింది. రాష్ట్రంలో అన్ని కారాగాల్లో అధికారులు వైద్యుల ద్వారా డ్రగ్స్ టెస్టులు జరుపుతున్నారు.
మహిళా ఖైదీల రభస
రిమాండు ఖైదీలు ఎక్కువగా డ్రగ్స్ వాడుతున్నారని తేలింది. ఇక మహిళా ఖైదీలు శాంపిల్స్ ఇవ్వడానికి తిరస్కరించారు. తాము ఎందుకు ఇవ్వాలని దబాయించారు. కొంతరైతే సీసాల్లో నీరు పోసి ఇచ్చారు. దీంతో పరీక్షల్లో గందరగోళం ఏర్పడింది. ప్రస్తుతం 10 శాతం మంది ఖైదీలకే పరీక్షలు చేశారు. దశలవారీగా అందరికీ నిర్వహిస్తారు. ఈ పరీక్షల్లో ఎండీఎంఏ, గంజాయి, హెరాయిన్, కొకై న్ వంటి 5 డ్రగ్స్‌ను గుర్తించవచ్చు.
బాధితులకు చికిత్స
పాజిటివ్ వచ్చిన ఖైదీలకు ప్రత్యేకంగా ఉంచి చికిత్స ప్రారంభించారు. మత్తు వ్యసనం ఎప్పటి నుంచి, ఎంత స్థాయిలో ఉందనేది బట్టి నివారణ చికిత్స ఇస్తారు. శరీరంలో డ్రగ్స్ మోతాదు ఎంత ఉంది అనేది నిమ్హాన్స్ నుంచి రిపోర్ట్ వస్తుంది.
మహిళా ఖైదీల్లోనూ డ్రగ్స్ సేవనం


