విడపనకల్లు: ఉగాది సందర్భంగా విడపనకల్లు మండలం హంచన్‌హాళ్ గ్రామంలో గురువారం నిర్వహించిన ఎద్దుల బండి పోటీలు హోరాహోరీగా సాగాయి. పోటీల్లో దాదాపు 10 జతల ఎద్దులు పాల్గొన్నాయి. ప్రథమ స్థానంలో ముస్తూరు లింగన్నకు చెందిన ఎద్దులు, ద్వితీయ స్థానంలో నాగేపల్లి రామచంద్రకు చెందిన ఎద్దులు, తృతీయ స్థానంలో నాగేపల్లి ఆంజనేయులు, నాల్గో స్థానంలో కె.సురేష్, ఐదో స్థానంలో నాగేపల్లి శ్రీకాంత్ ఎద్దులు నిలిచాయి. విజేత ఎద్దుల యజమానులను అభినందిస్తూ నగదు పురస్కారాలతో సర్పంచ్ నాగేపల్లి కేశన్న, రాకెట్ల రమేష్, రాకెట్ల వన్నూరు స్వామి, గ్రామస్తులు సత్కరించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు భీంరావు, వన్నూరుస్వామి, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.


