ఆచూకీ లేని సైకో | - | Sakshi
Sakshi News home page

ఆచూకీ లేని సైకో

Mar 20 2026 7:59 AM | Updated on Mar 20 2026 7:59 AM

శివాజీనగర: నిశ్చితార్థమై, త్వరలో పెళ్లి చేసుకోబోయే యువతి (18)ని బెంగళూరు డీజే హళ్లిలోని పాడుబడిన ఇంటిలో యువకుడు 3 రోజుల కిందట హత్య చేయడం తెలిసిందే. పోస్టుమార్టం తరువాత నివ్వెరపోయే నిజాలు బయటపడ్డాయి. దుండగుడు షబీల్‌ (20), ఆమెను మాటలకందని రీతిలో కిరాతకంగా హత్య చేశాడని పోలీసు వర్గాలు తెలిపాయి. మొదట యువతిని గొంతు కోసి హతమార్చాడు, ఆపై ఆమె రొమ్ములను కత్తితో కోసివేశాడు, తరువాత మర్మాంగంపై కత్తితో విచక్షణారహితంగా పొడిచాడని పోస్టుమార్టం నివేదికలో తెలిపారు. ఇంత ఉన్మాదిగా ఎందుకు మారాడు అనేది తేలాల్సి ఉంది. నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.

కోలార్‌కు చెందిన యువతి డీజే హళ్లిలోని తన అవ్వ ఇంటికి అప్పుడప్పుడు వస్తూ ఉండేది. ఈ సమయంలో ఇతడు పరిచయం పెంచుకుని ప్రేమ పేరుతో మభ్యపెట్టాడు, వారి కుటుంబీకులతో మాట్లాడి పెళ్లికి ఒప్పించారు. గతేడాది జూన్‌లో నిశ్చితార్థం చేశారు. కొన్నిరోజులుగా అతడు యువతి మీద అనుమానం పెంచుకున్నాడు. ఆ రోజు మాట్లాడాలని పిలించి తమ పాడుబడిన ఇంటికి తీసుకెళ్లి ప్రాణాలు తీసి పరారయ్యాడు.

అత్యంత దారుణంగా యువతి హత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement