విధి నిర్వహణలో అలసత్వం తగదు
రాయచూరు రూరల్: అధికారులు విధి నిర్వహణలో అలసత్వం వహించడం తగదని దమనిత సేవా సమితి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. దమనిత సేవా సమితి అధ్యక్షుడు భరత్ మాట్లాడుతూ.. రాయచూరు నగరంలోని పర్యాటక శాఖ అధికారులు విధులకు గైర్హాజరు అవుతున్నారని తెలిపారు. ఇష్టమొచ్చినప్పుడు విధులకు వస్తూ పని చేయకుండా కాలక్షేపం చేస్తున్నారని పేర్కొన్నారు. నిర్లక్ష్యంగా విధులు నిర్వరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సువర్ణ, నరసింహులు, శివ శంకర్, సుశీల్, పరశురాం, అశోక్, జావిద్ రాజు తదితరులు పాల్గొన్నారు.
కన్నడ భాషకు
కువెంపు సేవలు భేష్
రాయచూరు రూరల్: జాతీయ కవి కువెంపు కన్నడ భాషకు చేసిన సేవలు ఎనలేనివని అని కన్నడ జిల్లా సాహిత్య పరిషత్ కార్యదర్శి దండెప్ప బిరాదార్ కొనియాడారు. సోమవారం రాయచూరు తాలూకా ఉడుమ్‌గల్ ఖానాపూర్ ప్రభుత్వ హైస్కూల్‌లో కువెంపు జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులతో కలసి కువెంపు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కువెంపు కన్నడలో చేసిన రచనలతో కన్నడ భాషకు జ్ఞానపీఠ అవార్డు రావడానికి ప్రధాన కారకుడని వివరించారు. కార్యక్రమంలో వీణ, శివలీల, పద్మావతి, సావిత్రి, నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.
అక్రమ కట్టడాల
తొలగింపునకు శ్రీకారం
రాయచూరు రూరల్: నగరంలో నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా నిర్మించుకున్న కట్టడాల తొలగింపునకు నగర సభ అధికారులు చర్యలు చేపట్టారు. సోమవారం మావిన చెరువు వద్ద ఉన్న అక్రమ కట్టడాలలను జేసీబీతో ధ్వంసం చేశారు. గతంలో 80 అడుగులు ఉన్న రహదారిలో 30 అడుగులు ఆక్రమించి నిర్మించుకున్న కట్టడాలు, దుకాణాలు, ఇళ్లను తొలగించనున్నారు. అక్రమంగా భవనాలు నిర్మించుకున్న వారికి 15 రోజుల ముందుగానే నోటీసులు జారీ చేసినట్లు కమిషనర్ జుబీన్ మహాపాత్రో వెల్లడించారు.
అయ్యప్ప భక్తులకు భోజన వసతి
రాయచూరు రూరల్: సిరవార తాలూకా కవితాళలో కరీంసాబ్ తన నివాసంలో అయ్యప్ప మాలధారులకు భోజన వసతి కల్పించారు. మైనార్టీలు అయ్యప్ప స్వామి భక్తులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడంపై స్థానికులు అభినందించారు. హిందూ, ముస్లింలు అనే తేడా చూపకుండా మనుషులంతా ఒక్కటే అని కరీంసాబ్ నిరూపించారు.
వైద్య కళాశాల ఏర్పాటు చేయాలి
రాయచూరు రూరల్: విజయపురలో ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలని కార్యకర్త లలిత డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక ప్రజలతో కలసి ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వైద్య కళాశాల ఏర్పాటు విషయంలో జిల్లాలోని మంత్రులు, శాసన సభ్యులు మౌనం వహిస్తున్నారని మండిపడ్డారు. పబ్లిక్, ప్రైవేట్ పార్ట్‌నర్ షిప్ ఆధ్వర్యంలో వైద్య కళాశాలల నిర్వహణకు మంత్రి ఎంబీ.పాటిల్, శాసన సభ్యుడు బసన గౌడ పాటిల్‌యత్నాల్ ముందుకు రావడం సరికాదన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలల విషయంలో జిల్లాలోని మంత్రులు, శాసన సభ్యులు పదవులకు రాజీనామాలు చేసి ఆందోళనకు మద్దతు పలకాలని సూచించారు.
విధి నిర్వహణలో అలసత్వం తగదు
విధి నిర్వహణలో అలసత్వం తగదు
విధి నిర్వహణలో అలసత్వం తగదు
విధి నిర్వహణలో అలసత్వం తగదు


