
నదిలోకి దూకిన మహిళ?
దొడ్డబళ్లాపురం: ఉడుపి జిల్లా కొల్లూరు వద్ద మూకాంబిక దేవాలయం వద్ద బెంగళూరుకు చెందిన మహిళ మిస్సింగ్ అయ్యింది. ఆమె సౌపర్ణిక నదిలో కొట్టుకుపోయినట్లు సమాచారం.
వివరాలు.. బెంగళూరుకు చెందిన వసుధ చక్రవర్తి (46), ఆమె బెంగళూరు త్యాగరాజనగరలోని సీఆర్ గోవిందరాజులు కుమార్తె. తరచూ దేవాలయానికి వచ్చి దేవి దర్శనం చేసుకుని వెళ్లేవారు. ఆమె 28వ తేదీన సొంత కారులో బెంగళూరు నుంచి కొల్లూరుకు వచ్చారు. ఓ లాడ్జిలో బస చేశారు. మరుసటి రోజున తల్లిదండ్రులు ఆమెకు కాల్ చేయగా, స్పందన లేదు. దీంతో హుటాహుటిన కొల్లూరుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
టెన్షన్‌గా కనిపించారు
పోలీసులు స్థానికులను విచారించడంతో పాటు పలుచోట్ల సీసీ కెమెరాలను పరిశీలించారు. ఆమె చాలా టెన్షన్‌గా కనిపించారని, ఒంటరిగా వేగంగా వెళ్తూ ఉండగా చూశామని కొందరు చెప్పారు. ఆమె సమీపంలోని సౌపర్ణిక నది వైపు వెళ్లారని చెప్పారు. ఆమె నదిలోకి దూకారని, ప్రవాహంతో పాటు కొట్టుకుపోయారని మరికొందరు తెలిపారు. స్థానిక పోలీసులు, ఫైర్ సిబ్బంది నదిలో గజ ఈతగాళ్ల సాయంతో ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే వసుధ ఆచూకీ తెలియలేదు.
కొల్లూరులో బెంగళూరువాసి విషాదం