లోతట్టు ప్రాంతంలోకి చేరిన వరద నీరు
వర్షానికి తడిసిపోయిన పెసలు
వర్షపు నీటిలో రాకపోకలకు అవస్థలు పడుతున్న గ్రామస్తులు
రాయచూరురూరల్: కళ్యాణ కర్ణాటక ఎగువ భాగంలో గురువారం రాత్రి భారీ వర్షాలు కురిశాయి. వాగులు, వంతెనలు నీటితో నిండిి, ప్రవహిస్తున్నాయి. కలబుర్గి జిల్లా వాడిలో ఎండకు ఆరబెట్టిన పెసలు నీటిపాలయ్యాయి. చిత్తాపూర్ తాలుకాలో భీమా నది పొంగి ప్రవహిస్తోంది. గ్రామాల్లోకి నీరు చేరింది. బీదర్ జిల్లా బాల్కి తాలూకాలో అనంద వాడి, కారంజ మధ్య వంతెన వరద నీటిలో మునిగి పోయింది. దీంతో 16 గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అటవీశాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే, జిల్లాధికారి శిల్పా శర్మ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కలబుర్గి జిల్లా చించోళిలో నాగరాళ జలాశయం నుంచి నీరు విడుదల చేశారు. వాగులో నీరు అధికంగా ప్రవహించాయి. ముదుగల్‌లో వర్షపు నీటితో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి.
హోరెత్తుతున్న కృష్ణానది
వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన డీసీ శర్మ
200 గొర్రెలు గల్లంతు
హుబ్లీ: యాదగిరి జిల్లా హుణసగి తాలూకా మేలినగడ్డె వద్ద బసవసాగర్ డ్యాం నుంచి నీరు విడుదల చేశారు. నడ్డుగడ్డలో ఉన్న మేకలు నీటి ఉధృతికి కొట్టుకుని పోయాయి. ఘటన స్థలాన్ని రెవెన్యూ, పశుసంవర్థక శాఖ అధికారులు పరిశీలించారు. మొత్తం 200 పైగా గొర్రెలు, మేకలు గల్లంతు అయినట్లు గొర్రెల కాపరులు చెబుతున్నారు. తమకు ఆర్థికంగా నష్టం వాటిల్లినట్లు జీవాల కాపరులు నాగప్ప, మాలప్ప, చావమ్మ, చందనగౌడ, గద్దెప్ప, శివయ్య తెలిపారు.
విస్తారంగా వర్షాలు
విస్తారంగా వర్షాలు
విస్తారంగా వర్షాలు
విస్తారంగా వర్షాలు
విస్తారంగా వర్షాలు
విస్తారంగా వర్షాలు