రెచ్చిపోయిన ఆన్‌లైన్‌ కేటుగాళ్లు | - | Sakshi
Sakshi News home page

రెచ్చిపోయిన ఆన్‌లైన్‌ కేటుగాళ్లు

Aug 30 2025 7:48 AM | Updated on Aug 30 2025 7:54 AM

ముగ్గురి నుంచి

సుమారు రూ.20 లక్షలు దోపిడీ

హుబ్లీ: ఆన్‌లైన్‌ కేటుగాళ్లు తమ నక్కజిత్తులతో సామాన్య ప్రజలను ఏదో విధంగా దోచుకుంటూనే ఉన్నారు. తాజాగా నగరంలో ముగ్గురిని వేర్వేరుగా వంచించి రూ.లక్షల్లో దోచుకున్నారు. వివరాలు.. నగరంలో శ్రీకాంత్‌ అనే వ్యక్తికి ఫోన్‌ చేసిన గుర్తు తెలియని వ్యక్తి.. హైదరాబాద్‌ ఏవీ ఇన్‌వెస్ట్‌మెంట్‌ సొల్యూషన్‌ కంపెనీలో పెట్టుబడి పెడితే 6 శాతం లాభాలు వస్తాయంటూ నమ్మించారు. ఈ క్రమంలోనే దశల వారీగా రూ.11 లక్షలను ఖాతాలోకి బదలాయించుకున్నారు. మోసం పోయినట్లు గ్రహించిన శ్రీకాంత్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరో ఘటనలో లక్ష్మీకాంత్‌ మొబైల్‌ నంబర్‌ను గుర్తు తెలియని వ్యక్తి వాట్సాప్‌ గ్రూప్‌లో చేర్పించి రూ.6 లక్షలకు ఎగనామం పెట్టాడు. సదరు వ్యక్తులు ముందుగా లక్ష్మీకాంత్‌ ఫోన్‌ నంబర్‌కు ఓ లింక్‌ను పంపి గ్రూప్‌లో చేర్పించారు. ఆ తర్వాత పాన్‌ కార్డు తదితర వివరాలను తీసుకుని పెట్టుబడి పెడుతామని నమ్మబలికారు. రూ.6 లక్షలను తమ ఖాతాలోకి బదలాయించుకుని మోసం చేశారు. బాధితుడు సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంకో ఘటనలో ఐఫోన్‌ కొనుగొలు చేస్తే మరొక్కటి ఉచితంగా ఇస్తామని నమ్మించిన గుర్తు తెలియని వ్యక్తి స్థానిక నితిషా జే అనే మహిళ నుంచి రూ.2.20 లక్షల బదలాయించుకుని మోసగించాడు. ఈ ఘటనపై కేశ్వాపుర పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

సైబర్‌ నేరాల

నియంత్రణపై ప్రచారం

రాయచూరురూరల్‌: నగరంలో సైబర్‌ నేరాల నియంత్రణపై అవగాహన కల్పించేందుకు పోలీస్‌ యంత్రాంగం శ్రీకారం చుట్టింది. గురువారం రాత్రి నగరంలోని బోలమాను దొడ్డి చాణుక్య పురి కాలనీలో గజానన ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సైబర్‌ నేరాల నియంత్రణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ వెంకటేష్‌ విద్యార్థులకు సూచించారు. సైబర్‌ నేరాల వంచనలకు గురి కాకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. ఎవరైనా ఫోన్‌ చేసి అకౌంట్‌ వివరాలు, ఓటీపీలు అడిగితే చెప్పొద్దని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు కరి బసవ, మాలింగరాయ, శశిధర్‌, నేతలు రమేష్‌, నవీన్‌, రాఘవేంద్ర, వీరేంద్ర, రవి, నాగరాజ, వీరేష్‌, బసవరాజ, అంబరీష్‌, వెంకటేశ్‌, అశ్వని, రాధ, దీప్తి, జయ, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

రెండు బొలేరోల అప్పగింత

కోలారు: జిల్లా పోలీస్‌ శాఖకు రెండు బొలెరో వాహనాలను ఎమ్మెల్యేలు కొత్తూరు మంజునాథ్‌, కేవై నంజేగౌడ, ఎమ్మెల్సీ ఎంఎల్‌ అనిల్‌కుమార్‌ శుక్రవారం నగరంలోని ఎస్పీ కార్యాలయం వద్ద అప్పగించారు. ఎమ్మెల్యే కేవై నంజేగౌడ మాట్లాడుతూ అన్ని శాఖలకు గాను పోలీస్‌ శాఖ సిబ్బంది ఎంతో ఒత్తిడి మధ్య విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఇలాంటి శాఖకు తగిన మౌలిక సౌకర్యాలను అందించాల్సి ఉందన్నారు. ఎమ్మెల్యే కొత్తూరు మంజునాథ్‌ మాట్లాడుతూ సమాజంలో శాంతి భద్రతలు కాపాడడంలో పోలీసు శాఖ కీలక పాత్ర పోషిస్తోంది. ఎంతో ఒడిదుడుకుల మధ్య పోలీస్‌ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారన్నారు. సమాజంలో నేరాల అదుపునకు పోలీసులు అహర్నిశలు కృషి చేస్తున్నారు. వారు అందిస్తున్న సేవలు అపారమన్నారు. ఎమ్మెల్సీ ఎంఎల్‌ అనిల్‌కుమార్‌, ఎస్పీ బీ.నిఖిల్‌, ఏఎస్పీ రవిశంకర్‌, డీఎస్పీ నాగ్తె, సీఐ కాంతరాజ్‌ తదితరులు పాల్గొన్నారు

ధర్మస్థలపై కుట్రలను

ఖండిస్తూ ధర్నా

మాలూరు: పవిత్ర క్షేత్రం ధర్మస్థలపై పలువురు కుట్రలు చేసి అపఖ్యాతి పాలు చేయడాన్ని ఖండిస్తూ శుక్రవారం బీజేపీ కార్యకర్తలు నగరంలోని తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. తాలూకా బీజేపీ అధ్యక్షుడు టీబీ కృష్ణప్ప మాట్లాడుతూ హిందువుల పవిత్ర క్షేత్రమైన ధర్మస్థలపై పలువురు పని గట్టుకుని అపఖ్యాతి తేవడానికి కుట్రలు చేస్తున్నారు. వీరు చేస్తున్నదంతా కుట్రలేనని పోలీసు విచారణలో తెలుస్తోందన్నారు. కుట్రలకు పన్నాగం పన్నిన మహేష్‌ తిమిరోడి, చిన్నయ్య, సుజాత భట్‌, గిరీష్‌ మట్టణ్ణవర్‌, జయంత్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కోట్ల సంఖ్యలో భక్తులు కలిగిన ధర్మస్థల క్షేత్రంపై హిందువుల ధార్మిక భావాలను భంగం కలిగించడానికే ఈ కుట్రలు జరుగుతున్నాయన్నారు. శ్రీక్షేత్రంపై భవిష్యత్తులో ఇలాంటి కుట్రలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం తహసీల్దార్‌ ద్వారా ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించారు. ధర్నాలో జెడ్పీ మాజీ సభ్యుడు చిన్నస్వామిగౌడ, ఏ.రామస్వామిరెడ్డి, టీపీ మాజీ అధ్యక్షుడు ఆనంద్‌, మాజీ సభ్యుడు రామకృష్ణప్ప తదితరులు పాల్గొన్నారు.

రెచ్చిపోయిన  ఆన్‌లైన్‌ కేటుగాళ్లు1
1/2

రెచ్చిపోయిన ఆన్‌లైన్‌ కేటుగాళ్లు

రెచ్చిపోయిన  ఆన్‌లైన్‌ కేటుగాళ్లు2
2/2

రెచ్చిపోయిన ఆన్‌లైన్‌ కేటుగాళ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement