
ధర్మస్థల రక్షణకు ధర్మయుద్ధం
చెళ్లకెరె రూరల్: ధర్మస్థల మంజునాథ స్వామి ఆలయం ఓ పవిత్ర పుణ్యక్షేత్రం, ధర్మాన్ని కాపాడుకోవడం కోసం ధర్మయుద్ధం జరపాల్సి వస్తోందని చిత్రదుర్గ జిల్లా బీజేపీ అధ్యక్షుడు కేటీ కుమారస్వామి తెలిపారు. ఆయన శనివారం బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధర్నాలో పాల్గొని మాట్లాడారు. ధర్మస్థల గ్రామీణాభివృద్ధి సంస్థ నుంచి మహిళలకు స్వయం ఉపాధి కల్పించే విధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయినా హిందూ ధార్మిక విధానాలకు ఆటంకం కల్గించే విధంగా కుట్ర చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరిని చూసి ప్రజలు శాపనార్థాలు పెడుతున్నారు. ప్రజలు, భక్తుల మనోభావాలను దెబ్బ తీయరాదన్నారు. ఆందోళనలో జిల్లా ప్రధాన కార్యదర్శి రామదాసు, తాలూకా మండల అధ్యక్షుడు బీఎం సురేష్, జయపాలయ్య, శివపుత్రప్ప, సోమశేఖర్ మండిమఠ తదితరులు పాల్గొన్నారు.
ధర్మస్థలపై దుష్ప్రచారం తగదు
హొసపేటె: ధర్మస్థలపై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ నగరంలో బీజేపీ కార్యకర్తలు శనివారం నిరసన వ్యక్తం చేశారు. ర్యాలీని వేణుగోపాల స్వామి ఆలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం మీదుగా అంబేడ్కర్ సర్కిల్ వరకు నిర్వహించారు. అంబేడ్కర్ సర్కిల్‌లో కార్యకర్తలు మాట్లాడుతూ ధర్మస్థల పేరు ప్రతిష్టలను దిగజార్చుతున్నారని అన్నారు. ధర్మస్థల పవిత్రతకు భంగం కల్గిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. హిందువుల పవిత్ర స్థలమైన ధర్మస్థలలో విధ్వంసకర కార్యకలాపాలు సాగుతున్నాయని నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ధర్మస్థల పవిత్ర తపై అపప్రచారం అరికట్టాలని మండిపాటు
నిందితులను శిక్షించాలని డిమాండ్
వాడవాడలా కదం తొక్కిన హిందూ
సంఘాల నాయకులు, బీజేపీ శ్రేణులు

ధర్మస్థల రక్షణకు ధర్మయుద్ధం