
ఎడమ కాలువలో పడి వ్యక్తి గల్లంతు
హొసపేటె: భోజనం చేసిన తర్వాత చేతులు కడుక్కునేందుకు కాలువలోకి దిగిన వ్యక్తి ప్రమాదవశాత్తు కాలువలో జారి పడి మృతి చెందిన ఘటన గంగావతి తాలూకా సణాపుర గ్రామం వద్ద రిజర్వాయర్‌కు సమీపంలోని గంగమ్మ గుడి(జంగ్లీ క్రాస్) వద్ద తుంగభద్ర ఎడమ కాలువ సమీపంలో జరిగింది. మృతుడిని గంగావతి జయనగరలోని ప్రతిష్టాత్మక ఇస్లాం పాఠశాల కార్యదర్శి రాజ్‌కిరణ్ (38)గా గుర్తించారు. స్నేహితులతో కలిసి భోజనం చేసిన రాజ్ కిరణ్ కారులో సణాపుర రిజర్వాయర్ వద్దకు వచ్చి జంగ్లీ క్రాస్ సమీపంలోని గంగమ్మ ఆలయ సమీపంలోని తుంగభద్ర ఎడమ గట్టు కాలువలో చేతులు కడుక్కోవడానికి దిగినట్లు తెలిసింది. ప్రమాదవశాత్తు కాలువలోకి జారిపడి నీటిలో కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడటానికి కారు డ్రైవర్, అతని సన్నిహితుడు ప్రయత్నించారు. అయితే వారు విఫలయ్యారని తెలిసింది. అగ్నిమాపక దళ అధికారులు, సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని ఆ వ్యక్తి ఆచూకీ కోసం తెప్పల సాయంతో వెతికారు. కానీ ఇంతవరకు మృతదేహం దొరకలేదని పోలీసులు తెలిపారు.