
జానపద కళలపై ఆసక్తి పెంచుకోవాలి
రాయచూరు రూరల్: జానపద కళలపై ఆసక్తిని పెంచుకోవాలని మాజీ శాసన సభ్యుడు పాపారెడ్డి పిలుపు ఇచ్చారు. శనివారం ప్రైవేట్ మెడికల్ కళాశాలలో అంతర్జాతీయ జానపద దినోత్సవాన్ని ప్రారంభించి మాట్లాడారు. నేటి ఆధునిక యుగంలో అంతరించి పోతున్న కళలను, కళాకారులకు అన్ని విధాలుగా లాభాలు చేకూర్చేలా కళలు కాలరాసి పోతున్నాయని విచారం వ్యక్తం చేశారు. మొబైల్ రావడంతో పాత కాలం నాటి పదాలకు కవితలకు, సాహిత్యాభిరుచికి విలువ లేకుండా పోయిందన్నారు. విద్యార్థులకు విద్యార్జనకు తోడు జానపద పాటలపై ఉపాధ్యాయులు తమ వంతు బాధ్యతలు నెరవేర్చాలన్నారు. కార్యక్రమంలో శరణప్ప, బాలాజీ, అయ్యప్పయ్య, బాబురావు, ప్రతిభలున్నారు.