
కెమెరా దృశ్యకావ్యం
బనశంకరి: కెమెరా నేత్రం ఎన్నో అద్భుతాలకు ఆవిష్కారం, ఓ మంచి ఫోటో జీవితాంతం గుర్తుంటుంది. అందుకే ఫోటోగ్రఫీ కళ అంత ప్రాముఖ్యంగా మారింది. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాల సందర్భంగా బెంగళూరులోని చిత్రకళా పరిషత్‌లో యూత్ ఫోటోగ్రఫిక్ సొసైటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఛాయాచిత్ర ప్రదర్శన కళాప్రియులకు కనువిందు చేస్తోంది. పరిషత్‌లోని దేవరాజ్ అరస్ గ్యాలరీలో యూత్ ఫోటోగ్రఫిక్ సొసైటీ సభ్యులు, ఛాయాగ్రాహకులు తమ కెమెరాలలో బంధించిన పనోరమిక్ ఛాయాచిత్రాలు అబ్బురపరుస్తాయి. శనివారం నుంచి ప్రదర్శన ప్రారంభమైంది. నగరవాసులు, ఛాయాచిత్రప్రియులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఫోటోగ్రఫీ ఔత్సాహికులు కూడా పాల్గొని మెళకువలు తెలుసుకున్నారు.
నేడు వినూత్న పోటీలు
ప్రదర్శనలో విభిన్న రకాల ఛాయాచిత్రాలు కొలువుతీరాయి. ఫోటోలు, సెల్ఫీలు తీసుకుని జ్ఞాపకాలను పదిలం చేసుకున్నారు. ఆదివారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్యాన్వాస్ ఛాయాచిత్ర ప్రదర్శన, ఫోటోబూత్– కుటుంబచిత్రాలను తీసి ఫ్రేమింగ్ చేయడం, షూట్, షేర్ అండ్ విన్ వంటి వివిధ పోటీలు జరుగుతాయి. ఔత్సాహిక, వృత్తిపరమైన ఫోటోగ్రాఫర్లు, ప్రజలు పాల్గొని బహుమతులు పొందవచ్చని తెలిపారు.
చిత్రకళా పరిషత్‌లో ఛాయాచిత్ర మేళా
ఆకర్షించే వైవిధ్య ఫొటోలు

కెమెరా దృశ్యకావ్యం

కెమెరా దృశ్యకావ్యం

కెమెరా దృశ్యకావ్యం