
మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి
కేజీఎఫ్: విద్యార్థులకు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ భవిష్యత్తును ఉజ్వలం చేసుకోవాలని తిమ్మయ్య ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ సయ్యద్ ఆరిఫ్ సూచించారు. మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవంలో భాగంగా ఆ కళాశాల ఆధ్వర్యంలో పోలీస్ శాఖ గురువారం ఏర్పాటు చేసిన ర్యాలీని ఆయన ప్రారంభించి మాట్లాడారు. కుతూహలం, స్నేహితుల ఒత్తిడి, లేదా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతోందన్నారు. ఈ వ్యసనం అనేక రకాలైన సమస్యలకు దారితీస్తుందన్నారు. ఆరోగ్యంపై దుష్పరిణామం చూపిస్తుందన్నారు. యువత శక్తి సామర్థ్యాలను నిర్వీర్యం చేస్తుందన్నారు. వీటిని పరిగణలోకి తీసుకొని డ్రగ్స్‌కు దూరంగా ఉండాలన్నారు. ప్రిన్సిపాల్ డా శణై, సిబ్బంది పాల్గొన్నారు.