
జాతీయ రహదారిలో గుంతలకు మరమ్మతు
● సైదాపూర్ కర్ణాటక డ్రైవర్ల చేయూత
రాయచూరు రూరల్: గత 15 రోజుల నుంచి కురుస్తున్న వానలకు జాతీయ రహదారి నిండా గుంతలు పడ్డాయి. దాని మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం, పరిశ్రమల కేంద్రం, జాతీయ రహదారి అధికారులు ముందుకు రాని ఘటన యాదగిరి జిల్లాలో నెలకొంది. రాయచూరు–సైదాపూర్–యాదగిరి మధ్య జాతీయ రహదారిలో వాహన సంచారానికి వీలు లేకుండా పోయింది. ఇది గమనించిన సైదాపూర్ కర్ణాటక డ్రైవర్లు అండగా నిలబడి రహదారిలో ఉన్న గుంతలను పూడ్చడానికి నడుం బిగించారు. స్వంత ఖర్చుతో సిమెంట్, కాంక్రీట్, కంకర, ఇసుకను తీసుకొచ్చి రహదారిలో పడిన పెద్ద పెద్ద గుంతలను పూడ్చి మానవత చాటుకున్నారు.

జాతీయ రహదారిలో గుంతలకు మరమ్మతు

జాతీయ రహదారిలో గుంతలకు మరమ్మతు