
నగలు కొంటామంటూ చోరీ.. అరెస్టు
కేజీఎఫ్: బంగారం కొనాలంటూ వచ్చి ఆభరణాలను దొంగతనం చేసుకుని వెళ్లిన 5 మంది మహిళలు, ఒక పురుషున్ని బంగారుపేట పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 30 లక్షల విలువ చేసే 305 గ్రాముల బంగారు నగలు, ఓ ఆటో, రూ. 7.7 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. ఈ నెల 14వ తేదీన బంగారుపేట నివాసి శ్రీనివాసగుప్త తన జ్యూవెలరీ షాపునకు బుర్కా ధరించిన ఇద్దరు మహిళలు, ఓ పురుషుడు వచ్చారని, నగలు కొంటామని చెప్పారన్నారు. లాకర్ రూంలో ఉన్న బంగారు నగలు కలిగిన ప్లాస్టిక్ బాక్సును దొంగిలించుకుని వెళ్లారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు ప్రారంభించి నిందితులను గుర్తించారు. కోలారు నగరానికి చెందిన నగీనా, నవీనా, ముబీన్‌తాజ్, నగ్మా, జరీనా తాజ్, నజీర్‌పాషా అనేవారిని నిర్బంధించి జైలుకు తరలించారు.