
కానిస్టేబుల్ వేధింపులతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య
యశవంతపుర: పోలీసుల వేధింపులు తాళలేక ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన చిక్కమగళూరు జిల్లా కళస తాలూకా బస్తిగద్దె గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన నాగేశ్(32) ఆటో నడుపుతూ జీవిస్తున్నాడు. ఇతను డెత్‌నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు వచ్చి పరిశీలించారు. కుదురెముఖ పోలీసుస్టేషన్ కానిస్టేబుల్ సిద్దేశ్ వేధిస్తున్నాడని, దీంతో ఆత్మహత్య చేసుకున్నట్లు ఘటన స్థలంలో లభించిన సూసైడ్ నోట్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి పరారీలో ఉన్న సిద్దేశ్‌ను అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరు పరచగా రిమాండ్‌కు ఆదేశించారు. కాగా సిద్ధేశ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు, ప్రగతిపర సంఘల నాయకులు పోలీసుస్టేషన్ వద్ద అందోళన చేశాయి.