
క్రైస్తవుల హక్కుల పరిరక్షణకు నిబ్ కౌన్సిల్ అండ
శివాజీనగర: భారత రాజ్యాంగం క్రైస్తవులకు కల్పించిన హక్కులను కాపాడుకునేందుకు, క్రైస్తవులు, చర్చిలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు దేశవ్యాప్తంగా శాంతియుతంగా పోరాటం చేస్తున్నట్లు నేషనల్ ఇండిపెండెంట్ బిషప్స్ కౌన్సిల్ (నిబ్–కౌన్సిల్) సంస్థాపక అధ్యక్షుడు రైట్ రెవరెండ్ డాక్టర్ మార్టిన్ కాట్రగడ్డ తెలిపారు. నగరంలోని మిల్లర్స్ రోడ్డులో ఉన్న యునైటెడ్ థియోలాజికల్ కాలేజీలో మంగళవారం నిర్వహించిన దక్షిణ భారత సేవకుల, సంఘ పెద్దల సదస్సులో ఆయన పాల్గొని ఆయన మాట్లాడారు. క్రైస్తవులు క్రమ శిక్షణతో సమాజంలో జీవనం కొనసాగిస్తున్నారన్నారు. అలాంటి క్రైస్తవులకు అన్యాయం జరిగితే నిబ్ పోరాటం చేస్తుందన్నారు. ఏసుక్రీస్తు ప్రకటించిన సువార్తను అందించే సేవకులు ధనాపేక్షలేనివారై జీవితాలను గడుపుతూ కళంకం లేకుండా జీవించాలన్నారు. బిషప్ గుడివాడ జాషువా మాట్లాడుతూ దైవ సేవకులు విశ్వాసంగా సేవలు అందించాలన్నారు. నిబ్ కౌన్సిల్ ద్వారా ఆర్చ్ బిషప్‌గా సీనియర్ పాస్టర్ పండు మద్దలను నియమించి అభిషేకించారు. 5 మందికి బిషప్‌గా, 6 మందికి గౌరవ డాక్టరేట్ పట్టాలు ప్రదానం చేశారు. దేవుడి సేవకు ఆసక్తి కలిగిన కొంతమందికి పాస్టర్లుగా సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. అనంతరం డాక్టర్ రెవరెండ్ మార్టిన్ కాట్రగడ్డ దంపతులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో నిబ్ కౌన్సిల్ కర్ణాటక కన్వీనర్ బిషప్ ఎం.బెంజమిన్, కేబీఎస్‌ఎస్ మాజీ ప్రధాన కార్యదర్శి రెవరెండ్ ఎం.దానియేల్, నిబ్ కౌన్సిల్ డైరెక్టర్ రెవరెండ్ డాక్టర్ జయకుమార్ దానియేల్, కేటీసీఎంఎఫ్ చైర్మన్ రెవరెండ్ డాక్టర్ ఎన్.ప్రేమానందం, నిబ్ కౌన్సిల్ నాయకులు రెవరెండ్ వీ.డీ.క్రిష్టపర్, రెవరెండ్ రత్నకుమార్, రెవరెండ్ ఎం.బీ.మోజస్, డాక్టర్ ఎన్.ఎస్.అరుణ్‌కుమార్, రెవరెండ్ విజయకుమార్ పాల్గొన్నారు.
నిబ్ కౌన్సిల్ సంస్థాపక అధ్యక్షుడు రైట్ రెవరెండ్ డాక్టర్ మార్టిన్ కాట్రగడ్డ

క్రైస్తవుల హక్కుల పరిరక్షణకు నిబ్ కౌన్సిల్ అండ

క్రైస్తవుల హక్కుల పరిరక్షణకు నిబ్ కౌన్సిల్ అండ