
ట్రావెల్స్ బస్సు పల్టీలు
కెలమంగలం: కోయంబత్తూరు నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఓ స్లీపర్ ట్రావెల్స్ బస్సు హోసూరు సమీపంలోని కరుకనహళ్లి వద్ద బోల్తాపడిన ఘటనలో 40 మందికి తీవ్ర గాయాలేర్పడిన ఘటన మంగళవారం ఉదయం రాయకోట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకొంది. వివరాల మేరకు కోయంబత్తూరు నుంచి 40 మంది ప్రయాణికులతో బెంగళూరుకు మంగళవారం వేకువజాము 2 గంటలకు బస్సు బయల్దేరింది. ఉదయం 6 గంటల ప్రాంతంలో రాయకోట సమీపంలోని కరుకనహళ్లి వద్ద వెళుతుండగా డ్రైవరు నిద్రమత్తులోకి జారుకోవడంతో అదుపుతప్పి పక్కన సర్వీసు రోడ్డులోకి పడిపోయింది. నిద్రలో ఉన్న ప్రయాణికులు ఏం జరిగిందోనని గట్టిగా కేకలు వేశారు. గమనించిన స్థానికులు రాయకోట పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదంలో ఇరుక్కుపోయిన క్షతగాత్రులను రక్షించి అంబులెన్స్‌ల ద్వారా హోసూరు, క్రిష్ణగిరి ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందినట్లు సమాచారం. కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు.
40 మందికి తీవ్ర గాయాలు

ట్రావెల్స్ బస్సు పల్టీలు