
రైతులకు లబ్ధి చేకూర్చడమే ధ్యేయం
గౌరిబిదనూరు: వ్యవసాయ ఉత్పత్తులకు సహకార శాఖ మార్కెటింగ్ ద్వారా గిట్టుబాటు ధర కల్పించడమే ప్రభుత్వ ఉద్దేశమని, ఇందులో భాగంగా టీఏపీసీఎంఎస్(తాలూకా వ్యవసాయదారుల ఉత్పత్తి సహకార మార్కెటింగ్ సోసైటీ)లో రైతు బజార్ ఏర్పాటు చేస్తామని మాజీ మంత్రి, డాక్టర్ హెచ్‌ఎన్ ప్రాధికార అధ్యక్షుడు ఎన్‌హెచ్ శివశంకరరెడ్డి అన్నారు. పట్టణంలోని ఎంజీ రోడ్డులో కొత్తగా నిర్మించిన టీఏపీసీఎంఎస్ భవనాన్ని సోమవారం ఆయన ప్రారంభించి ప్రసంగించారు. తాను ఉపసభాపతిగా ఉన్న సమయంలో డీసీసీ బ్యాంకు పునశ్చేతనానికి సిద్దరామయ్య ఎంతో సహకారమందించారన్నారు. 2013లో బ్యాంకు ప్రగతి పథంలో నడిచిందన్నారు. తాలూకాలో 4వేల సంఘాలకు వడ్డీ లేని రుణాలను అందించామన్నారు. కార్యక్రమంలో అపెక్స్ బ్యాంకు డైరెక్టర్ బ్‌యాలహళ్ళి గోవిందేగౌడ,సహకార సంఘం అధ్యక్షుడు నాగరాజు,నసీమ,టిఎపిసిఎంఎస్ అధ్యక్షుడు మరళూరు హనుమంత రెడ్డి,ఉపాధ్యక్షుడు రమేశ్ నాయక్,రవిచంద్రారెడ్డి, ప్రమీలాబాలాజీ, సతీశ్‌కుమార్, కాంట్రాక్టర్ నాగరాజు, ప్రకాశరెడ్డి, తారానాథ్ పాల్గొన్నారు.