
అగ్నికీలల్లో భవనం
బనశంకరి: బెంగళూరులో బృహత్ విస్ఫోటం జరిగి భవనం కూలిన దుర్ఘటనను మరువక ముందే మరో ఘోర ప్రమాదం జరిగింది. కేఆర్ మార్కెట్ నగర్తపేటేలో నాలుగు అంతస్తుల కట్టడంలో సంభవించిన అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు, మరొకరు సజీవ దహనమయ్యారు. ఈ ఘటన హలసూరుగేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సంభవించింది. మృతులు వ్యాపారి మదన్‌కుమార్ (38), భార్య సంగీత (33), వారి పిల్లలు మితేశ్ (8), విహాన్ (5), మరో అంతస్తులో సురేశ్ (36).
తెల్లవారుజామున..
సందీప్, బాలకృష్ణ అనే ఇద్దరికి చెందిన నాలుగు అంతస్తుల భవనంలో అనేక కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇందులోనే ప్లాస్టిక్ వస్తువుల తయారీ యూనిట్లు కూడా ఉన్నాయి. శనివారం తెల్లవారుజామున 3.30 సమయంలో అగ్ని ప్రమాదం మొదలైంది. భవనం గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు రెండో అంతస్తులో ప్లాస్టిక్ గోదాములు, తయారీ యూనిట్లు ఉండగా, మొదటి అంతస్తులో ఉన్న ముగ్గురు కార్మికులు మంటలు వ్యాపించగానే బయటికి పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు. మూడో అంతస్తులో వ్యాపారి మదన్‌కుమార్ కుటుంబం నివాసం ఉంటోంది. మదన్ ఇంటికి బయటి నుంచి తాళం వేసుకుని, గ్రౌండ్‌ఫ్లోర్‌లో తన యూనిట్‌లో పనిలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో అగ్నిప్రమాదం జరగ్గా మదన్ మంటల్లో చిక్కాడు.
పై అంతస్తులో కుటుంబం..
సమాచారం అందిన వెంటనే ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను అదుపుచేయగా శ్రమించారు. రెండుగంటలపాటు ఏకధాటిగా నీళ్లు చిమ్మి ఆర్పివేశారు. 3వ అంతస్తులోని మదన్ ఫ్లాటు తాళాన్ని పగలగొట్టి వెళ్లి చూడగా అతని భార్య, ఇద్దరు పిల్లలు వేడి, పొగ తాకిడికి చనిపోయి ఉన్నారు. వీరు రాజస్థాన్ నుంచి వలసవచ్చి వ్యాపారం చేస్తున్నట్లు తెలిసింది. పై అంతస్తులోని ఫ్లాటులో సురేష్ అనే వ్యక్తి మరణించాడు.
సిలిండర్ పేలుడా.. కరెంటు వైర్లా?
భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లో ప్లాస్టిక్ మ్యాట్లను తయారీ కేంద్రంలో మంటలు రేగి కట్టడం మొత్తం వ్యాపించినట్లు అనుమానాలున్నాయి. గ్యాస్ సిలిండర్ లీకై , లేదా కరెంటు వైర్ల నుంచి మంటలు వచ్చి ఉంటాయని చెబుతున్నారు. ఇరుకై న సందులో భవనం ఉండడంతో సహాయక చర్యలకు తీవ్ర ఇబ్బంది కలిగింది. దట్టమైన పొగ వ్యాపించడంతో నివాసితులకు దిక్కుతోచలేదు. ఫైర్, ఎస్‌డీఆర్‌ఎఫ్, పోలీసులు, 6 ఫైరింజన్లతో శ్రమించారు. మృతదేహాలను విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి.
మృతులు మదన్‌కుమార్, భార్య సంగీత, పిల్లలు (ఫైల్) సురేశ్ (ఫైల్)
ఓ కుటుంబం, మరొకరు మృత్యువాత
బెంగళూరులో నగర్తపేటెలో
ఘోర ప్రమాదం
ప్లాస్టిక్ యూనిట్లో మంటలే కారణం!
విచారణ సాగుతోంది:
కమిషనర్
షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం సంభవించి ఉండవచ్చునని నగర పోలీస్ కమిషనర్ సీమంత్‌కుమార్ సింగ్ తెలిపారు. ఘటనాస్థలిని ఆయన పరిశీలించారు. ఫైర్ అధికారులు, విద్యుత్ ఇంజినీర్లు తనిఖీ చేస్తున్నారని, అందులో కచ్చితమైన కారణం తెలుస్తుందని చెప్పారు. ఓ ఇంటికి తాళం వేసి ఉండడంతో వారిని కాపాడడం ఇబ్బందిగా మారిందని అన్నారు.

అగ్నికీలల్లో భవనం

అగ్నికీలల్లో భవనం

అగ్నికీలల్లో భవనం

అగ్నికీలల్లో భవనం