శనివారం ధార్వాడలో కృష్ణాష్టమి సంబరాల్లో బాలలు
బెంగళూరు ఇస్కాన్ దేవస్థానంలో భక్తులు
బనశంకరి: మానవాళికి భగవద్గీత ద్వారా గీతోపదేశం చేసిన శ్రీకృష్ణ పరమాత్ముడు పుట్టినరోజును శనివారం కన్నడనాడు అంతటా ఆనందోత్సాహాలతో ఆచరించారు. బాలలు నల్లనయ్య, గోపికల మాదిరిగా అలంకరించుకుని మురిపించారు. ఆలయాలలో విశేష వేడుకలు జరిగాయి. బెంగళూరు రాజాజీనగర ఇస్కాన్ ఆలయంలో వేకువజాము నుంచి అర్చకులు రాధాకృష్ణుల విగ్రహాలకు వివిధ అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. వందలాదిగా భక్తులు తరలివచ్చి వెన్నదొంగను దర్శించుకున్నారు. బెంగళూరులోని శ్రీకృష్ణ ఆలయాలు హరే రామ హరే కృష్ణ నినాదాలతో మారుమోగాయి. రాధా కృష్ణ వేషధారణతో పిల్లలతో వేడుకలు ఆకట్టుకున్నాయి. ఉడుపి శ్రీకృష్ణ మఠంలో కృష్ణజయంతి వేడుకలు నిర్వహించారు. ఉట్టి కొట్టే వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. ధార్వాడలో కృష్ణ గోపికల రూపాల్లో బాలలు అలరించారు.
రాష్ట్రంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు
రాధాకృష్ణుల వేషాల్లో బాలల సందడి
గోపాలా.. గోవింద.. దీవించరావ
గోపాలా.. గోవింద.. దీవించరావ
గోపాలా.. గోవింద.. దీవించరావ
గోపాలా.. గోవింద.. దీవించరావ