హైకోర్టు విచారణ జరపాలి
శివాజీనగర: ఆర్‌సీబీ విజయోత్సవాలలో చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాటలో చనిపోయిన వారి కుటుంబాలకు కనీసం రూ.50 లక్షలు చొప్పున పరిహారాన్ని ఇవ్వాలని కేంద్ర మంత్రి శోభా కరంద్లాజె డిమాండ్ చేశారు. గురువారం ఆమె స్పందిస్తూ ఈ దుర్ఘటనపై న్యాయ విచారణ జరపాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖరాశారు. ప్రజా సంక్షేమం దృష్ట్యా సుమోటోగా కేసు నమోదు చేసి రాష్ట్ర హైకోర్టుచే విచారణ చేయించాలని మనవిచేశారు. గాయపడినవారి చికిత్స ఖర్చులను ప్రభుత్వమే భరించాలి. బౌరింగ్, విక్టోరియా ఆసుపత్రుల్లో ఉన్న క్షతగాత్రులకు నిపుణులచే శస్త్రచికిత్సలకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులను పరామర్శించారు.


