మానవతా విలువలు పెంచుకోవాలి
రాయచూరు రూరల్: విద్యార్థులు మానవతా విలువలను పెంచుకోవాలని సోమవారపేటె మఠాధిపతి అభినవ రాచోటి శివాచార్య, మంగళవారపేటె మఠాధిపతి వీరసంగమేశ్వర శివాచార్య పేర్కొన్నారు. వీరశైవ కళ్యాణ మంటపంలో గాణిగ సమాజం ఆధ్వర్యంలో 2024–25లో ఉత్తమ శ్రేణిలో పాసైన పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు సన్మాన కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు పచ్చని నగరం, ప్లాస్టిక్ నిర్మూలనకు పాటు పడాలన్నారు. గాణిగ సమాజం అధ్యక్షుడు చెన్నప్ప సజ్జన్,ి ససిద్రామప్ప, శకుంతల, లక్ష్మీబాయి, బసప్ప గొరేబాళ్, విజయ్ కుమార్‌లున్నారు.
మానవతా విలువలు పెంచుకోవాలి


