బసవణ్ణ ఆదర్శాలు అనుసరణీయం
రాయచూరు రూరల్: బసవణ్ణ ఆదర్శాలను అలవర్చుకోవాలని హిందుస్తానీ శాసీ్త్రయ సంగీత గాయని పార్వతి అన్నారు. బుధవారం రాత్రి పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో కలా సంకుల సంస్థ ఆధ్వర్యంలో జరిగిన బసవేశ్వరుని జయంతిని పురస్కరించుకొని బసవశ్రీ అవార్డు అందుకొని ఆమె మాట్లాడారు. ప్రపంచ మానవాళి అభ్యున్నతికి బసవణ్ణ పాటుపడ్డారన్నారు. సమాజంలో బడుగు వర్గాల అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించిన మహాన్ ప్రవక్తగా కొనియాడారు. జిల్లా జైల్ సూపరింటెండెంట్ అనిత, బసవరాజ్, చంద్రశేఖర్ పాటిల్, మారుతి, రేఖ, చెన్నబసవ, హనుమంతరాయ, బసవరాజ్, నిజాముద్దీన్, రేణుక, శృతి, లక్ష్మిపతి, విద్యానంద రెడ్డి, కృష్ణ, యంకప్ప తదితరులు పాల్గొన్నారు.
ఈతకు వెళ్లి యువకుడి మృతి
కెలమంగలం: ఈతకు వెళ్లి యువకుడు మృత్యువాత పడ్డాడు. ఈఘటన డెంకణీకోట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకొంది. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు చామరాజ్‌నగర్ ప్రాంతానికి చెందిన పునీత్(28) రెండు రోజుల క్రితం డెంకణీకోట సమీపంలోని రంగసంద్రం గ్రామంలో నివాసముంటున్న బంధువుల ఇంటికెళ్లాడు. బుధవారం అదే ప్రాంతంలోని వ్యవసాయ బావిలో ఈతకు వెళ్లాడు. అదుపు తప్పి నీటిలో మునిగి మృతి చెందాడు. డెంకణీకోట పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు.


