బీర్ ప్రియులకు సర్కార్ షాక్
బనశంకరి: ఆర్థిక సంవత్సరం ప్రారంభమై నెల పూర్తయిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం బీర్ ప్రియులకు ధరలు పెంచుతూ షాక్ ఇచ్చింది. ప్రతి బాటిల్ బీరుపై రూ.10–20 ధర పెంచింది. బీరుపై ఏఈడీ పెంచడం ద్వారా పరోక్షంగా ఐఎంఎల్ విక్రయాలు పెంచడానికి సిద్ధమైంది. ఎకై ్సజ్ శాఖ నుంచి ప్రభుత్వ ఖజానాకు వచ్చే ఆదాయంలో ఐఎంఎల్ అగ్రస్థానం కలిగి ఉంది. ఐఎంఎల్ విక్రయాలు పెరిగితే అధిక ఆదాయం వస్తుంది. ఈ కారణంతో ప్రభుత్వం బీరుపై అదనపు ఎకై ్సజ్ సుంకం (ఏఈడీ) శాతం పెంచాలని నిర్ణయించి ఆదేశాలు జారీ చేసింది. ప్రజల నుంచి అభ్యంతరాలు తెలియజేయడానికి 7 రోజుల సమయం ఇచ్చింది. రాష్ట్రంలో ప్రస్తుతం బీరుపై ఏఈడీ ఉత్పత్తి వ్యయం 195 శాతం ఉంది.
బ్రాండ్ బ్రాండ్‌కూ వ్యత్యాసం
ప్రస్తుతం అదనపు ఎకై ్సజ్ సుంకం 205 శాతానికి పెంచినట్లు ఆదేశాల్లో ప్రస్తావించింది. ధర పెంపు బ్రాండ్ నుంచి బ్రాండ్‌కు వ్యత్యాసం ఉంది. ఆల్కహాల్ ప్రమాణం అధికంగా ఉండే బ్రాండ్లు బీర్లపై గణనీయంగా పెరగనుందని ఎకై ్సజ్ శాఖ అధికారులు తెలిపారు. మొత్తం రూ.10–20 ధర పెరిగే అవకాశం ఉంది. 2023 జూలైలో కాంగ్రెస్ ప్రభుత్వం అదనపు ఎకై ్సజ్ సుంకాన్ని 175 శాతం నుంచి 185 శాతానికి పెంచింది. అనంతరం 2025 జనవరి 20వ తేదీ బడ్జెట్‌కు ముందు మరోసారి ఏఈడీని సవరించింది. అదనపు ఎకై ్సజ్ సుంకాన్ని 185 నుంచి 195 శాతానికి అంటే ప్రతి బల్క్ లీటరుకు రూ.130 వరకు పెంచారు. ప్రస్తుతం ప్రభుత్వానికి మూడోసారి పన్ను(ట్యాక్స్) పెంచడానికి సిద్ధమైంది. మూల ఎకై ్సజ్ సుంకం సైతం సవరించారు. ఫ్లాట్ రేట్ బదులుగా ఆల్కహాల్ ప్రమాణం ఆధారంగా శ్రేణీకృత వ్యవస్థను పరిచయం చేశారు. 5 శాతం కంటే తక్కువ ఆల్కహాల్ ప్రమాణం కలిగిన బీరుకు ప్రతి బల్క్ లీటరుపై రూ.12 చొప్పున, 8 శాతం ఆల్కహాల్ బీరుపై రూ.20 చొప్పున ధర పెంచుతూ నిర్ణయించారు.
ఆర్థిక ఏడాది ప్రారంభంలోనే ధర పెంపు
10 శాతానికి పైగా ఎకై ్సజ్ సుంకం విధింపు


