జోరందుకున్న జల్లు వానలు
బనశంకరి: జూన్‌లో రుతుపవనాలను తలపించేలా ఇప్పుడే వానలు వస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. బెంగళూరు– రూరల్, దక్షిణ కన్నడ, ఉడుపి, ఉత్తర కన్నడ, కొడగు, హాసన్, శివమొగ్గ, చిక్కమగళూరు, కోలారు, మండ్య, తుమకూరు, మైసూరు, చామరాజనగర, చిత్రదుర్గ, బళ్లారి జిల్లాల్లో 21, 22 తేదీల్లో వడగండ్లతో కూడిన వర్షం కురవవచ్చని వాతావరణశాఖ తెలిపింది.
నగరంలో వర్షం
ఆదివారం ఉద్యాననగరిలో విజయనగర, మెజస్టిక్, జయనగర, జేపీ.నగర, గోవిందరాజనగర, మల్లేశ్వరం, కోరమంగల, ఆడుగోడి, ఎలక్ట్రానిక్ సిటీ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. ప్రజలు తడవకుండా చెట్లు, కట్టడాల్లోకి పరుగులు తీశారు. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బెంగళూరు గ్రామాంతర జిల్లాల్లో ఈదురుగాలులు, వానలకు పాత ఇళ్లు, షెడ్లు దెబ్బతిన్నాయి. హొసకోటే తాలూకా ఎన్.హొసహళ్లిలో వడగండ్ల వాన పడింది. ఉరుములు, మెరుపులు కూడా తోడయ్యాయి.
గాలుల ప్రభావం
24 జిల్లాలకు భారీ వర్షాలు రావచ్చని ఎల్లో అలర్ట్‌ను ప్రకటించారు. 26వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని, ఉత్తర, దక్షిణ ప్రాంతాలకు అలర్ట్ ఉందని వాతావరణ శాఖ శాస్త్రవేత్త సీఎస్ పాటిల్ తెలిపారు. కొన్ని జిల్లాల్లో గంటకు 30–50 కిలోమీటర్ల వేగంతో గాలితో కూడిన వర్షాలు కురుస్తాయని, మత్య్సకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని వాతావరణశాఖ తెలిపింది.
24 జిల్లాల్లో వారంపాటు వర్షసూచన
వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్
జోరందుకున్న జల్లు వానలు
జోరందుకున్న జల్లు వానలు


