ఏకే 47, మోడల్స్‌తో రీల్స్‌ హంగామా | - | Sakshi
Sakshi News home page

ఏకే 47, మోడల్స్‌తో రీల్స్‌ హంగామా

Jul 2 2024 12:30 AM | Updated on Jul 2 2024 7:08 AM

-

కటకటాలు పాల్జేసిన సోషల్‌ మీడియా పిచ్చి

బనశంకరి: పేద్ద బంగళాలు, ఏకే 47 తుపాకులతో గార్డుల పహరా, అందమైన భామలు, కార్లు.. ఇవన్నీ హైఫై బాలీవుడ్‌ సినిమాలో కనిపించే సీన్లే కాదు. బెంగళూరులో కొందరు సోషల్‌ మీడియాప్రియులు ఎంతో ఖర్చు పెట్టి మరీ ఇటువంటివి సమకూర్చుకుని రీల్స్‌ చేస్తున్నారు. రీల్స్‌ పిచ్చి ఏమిటని విమర్శలువచ్చినా పట్టించుకోరు. తుపాకులతో గార్డులు, మోడల్స్‌ మధ్య రీల్స్‌ చేసిన అరుణ్‌ కటారె అనే బెంగళూరువాసిని కొత్తనూరు పోలీసులు అరెస్ట్‌ చేశారు.

 

 

కళ్లు చెదిరేలా పోజులు
అరుణ్‌ కటారె సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉంటాడు. బడా సంపన్నుడిలా పోజులిస్తుంటాడు. కొత్త రీల్‌ చేయాలని చేతిలో ఏకే 47 ఉత్తుత్తి గన్‌లు పట్టుకుని రోడ్డులో షో చేస్తూ ఒంటిపై కేజీలకొద్దీ నకిలీ బంగారు ఆభరణాలు ధరించాడు. పైగా బాడీగార్డులు కూడా ఉన్నారు. ఈ హంగామాతో భయపడిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కొత్తనూరు పోలీసులు వచ్చి అరుణ్‌ను అరెస్ట్‌చేసి విచారణ చేపట్టారు. నకిలీ ఏకే 47 తుపాకులు, అనుచరులను వెంటేసుకుని స్థానికంగా హవా సృష్టించడానికి ఇలాంటి షో చేసినట్లు వెలుగుచూసింది. ఇతడు, గార్డులపై కేసు నమోదు చేసి పరప్పన జైలుకు పంపించారు.

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement