విమానంలో ఎన్‌ఆర్‌ఐ వెకిలి చేష్టలు | - | Sakshi
Sakshi News home page

విమానంలో ఎన్‌ఆర్‌ఐ వెకిలి చేష్టలు

Nov 9 2023 1:04 AM | Updated on Nov 9 2023 8:29 AM

- - Sakshi

విమానంలో తన పక్క సీట్లో కూర్చున్న మహిళా ప్రయాణికురాలితో వెకిలి చేష్టలు వేసిన వ్యక్తిని బెంగళూరు కెంపేగౌడ ఎయిర్‌పోర్టు పోలీసులు అరెస్టు చేశారు.

దొడ్డబళ్లాపురం: విమానంలో తన పక్క సీట్లో కూర్చున్న మహిళా ప్రయాణికురాలితో వెకిలి చేష్టలు వేసిన వ్యక్తిని బెంగళూరు కెంపేగౌడ ఎయిర్‌పోర్టు పోలీసులు అరెస్టు చేశారు. లుఫ్తాన్సా విమానంలో ఫ్రాంక్‌ఫర్ట్‌ నుంచి బెంగళూరుకు వస్తున్న ఎన్నారై రంగనాథ్‌.. పక్క సీట్లో మహిళ నిద్రిస్తుండగా ఆమెను అసభ్యంగా తాకసాగాడు.

మహిళ మేలుకుని అతన్ని అడ్డుకుంది. సిబ్బంది సహాయంతో మరో సీటులోకి మారింది. విమానం బెంగళూరులో దిగగానే బాధిత మహిళ కేఐఏ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి నిందితుడు రంగనాథ్‌ను అరెస్టు చేశారు. ప్రాథమిక విచారణ జరిపి అతన్ని బెయిలుపై వదిలేశారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement