డీకే సీఎం అయితే మద్దతిస్తాం: కుమార | Sakshi
Sakshi News home page

డీకే సీఎం అయితే మద్దతిస్తాం: కుమార

Published Sun, Nov 5 2023 1:40 AM

- - Sakshi

బనశంకరి: డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ ముఖ్యమంత్రి అయితే ఇప్పుడు జేడీయస్‌లోని 19 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తామని ఆ పార్టీ మాజీ సీఎం హెచ్‌డీ.కుమారస్వామి ఆఫర్‌ ఇచ్చారు. కాంగ్రెస్‌ పరిస్థితి చూస్తే ఎంతమంది సీఎం అవుతారో తెలియదని వ్యంగ్యమాడారు.

శనివారం నగరంలోని పార్టీ ఆఫీసులో రాష్ట్రంలో కరువు పరిస్థితిపై సమీక్ష చేసి మాట్లాడారు. కాంగ్రెస్‌ పరిస్థితి చూస్తే తాత్కాలిక ముఖ్యమంత్రి ప్రభుత్వమని పిలవవచ్చునని ఆరోపించారు. కరువు నుంచి రైతులను కాపాడాలని డిమాండ్‌ చేశారు. సీఎం అవుతానన్న మంత్రి ప్రియాంక ఖర్గే కలబురిగి ప్రజలకు చేసింది ఏమిటి అన్నారు. గృహలక్ష్మీ పథకంలో ఎంతమందికి డబ్బు ఇచ్చారని ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement