వారానికి 70 గంటల పని ఎందుకు? | - | Sakshi
Sakshi News home page

వారానికి 70 గంటల పని ఎందుకు?

Nov 3 2023 1:16 AM | Updated on Nov 3 2023 1:16 AM

- - Sakshi

జస్టిస్‌ సంతోష్‌ హెగ్డే

బనశంకరి: ఉద్యోగులు వారానికి 70 గంటలు పనిచేయాలని ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి కోరడంపై మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. అన్ని గంటల పని అవసరం లేదు. దీనికి బదులు పనివేళల్లో బాగా పనిచేసి, మిగిలిన సమయం మీ కుటుంబంతో గడపాలని విశ్రాంత లోకాయుక్త జస్టిస్‌ సంతోష్‌హెగ్డే అన్నారు. గురువారం నగరంలో ఏర్పాటుచేసిన ది ట్రేడింగ్‌ మైండ్స్‌ సంస్థ వేడుకలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఎక్కువ సమయం పనిచేయడం వల్ల అధిక ఉత్పత్తి వస్తుంది అనేది తప్పుడు భావన అన్నారు. పని గంటలని బాగా ఉపయోగించుకోవడమే మనకు ముఖ్యమని తెలిపారు. సుప్రీంకోర్టు రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్‌ గోపాలగౌడ మాట్లాడుతూ ఆర్థికత, అభివృద్ధి మాత్రమే కాదు, అన్నిరంగాల్లో వికాసం సాధించాలని అన్నారు. ఆర్థిక ప్రగతి మాత్రమే ప్రగతి అనిపించుకోదన్నారు. పవన్‌జోషి, అనుశ్రుత్‌ మంచి, డాక్టర్‌ వినయ్‌శెట్టి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement