My Wife Namitha Had An Extra-marital Affair With A Drug Dealer : Producer T Chandrashekhar - Sakshi
Sakshi News home page

నా భార్య నమిత డ్రగ్స్‌ విక్రేతతో వివాహేతర సంబంధం పెట్టుకుంది : సినీ నిర్మాత

Jun 27 2023 6:06 AM | Updated on Jun 27 2023 10:10 AM

- - Sakshi

ఆమెకు డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్న లక్ష్మీశ్‌ ప్రభుతో అక్రమ సంబంధం పెట్టుకుంది.

తన భార్య మత్తు పదార్థాలకు బానిస కావడంతో పాటు డ్రగ్స్‌ విక్రేతతో అక్రమ సంబంధం పెట్టుకుందని కన్నడ నటుడు, నిర్మాత టి చంద్రశేఖర్‌ భార్య నమిత, ఆమె స్నేహితుడు లక్ష్మీశ్‌ ప్రభులపై బెంగళూరు చెన్నమ్మనకెరె అచ్చుకట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.. రెండేళ్ల క్రితం చంద్రశేఖర్‌, నమితను పెళ్లాడారు.

(ఇదీ చదవండి: ఆమెకు ఇష్టం లేకున్నా ఎలా పట్టుకుంటావ్‌.. నటుడిపై ట్రోల్స్‌)

బనశంకరి సెకండ్‌ స్టేజీ లో నివాసం ఉంటున్నారు. నమిత మత్తు పదార్థాలకు అలవాటు పడింది, మానేయాలని బుద్ధిమాటలు చెప్పినా పట్టించుకోవడం లేదు. ఆమెకు డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్న లక్ష్మీశ్‌ ప్రభుతో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఇటీవల ఇంటిలో ఇద్దరూ రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోవడంతో ప్రశ్నిస్తే నాపైనే దాడి చేశారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.

(ఇదీ చదవండి: కళ్యాణ్‌ రామ్‌ హీరోయిన్‌ ఇలా కనిపించేసరికి ఆశ్చర్యపోయిన అభిమాని)

తప్పుడు ఆరోపణలన్న భార్య
కాగా, భర్త తనపై దాడి చేశాడని భార్య నమితా కూడా ఫిర్యాదు చేసింది. తనకు లక్ష్మీశ్‌ స్నేహితుడు మాత్రమేనని, భర్త తప్పుడు ఆరోపణలు చేస్తున్నట్లు నమితా పేర్కొంది. అతని స్నేహితులు అరుణ్‌, హేమంత్‌లు తనపై చాకుతో దాడి చేసినట్లు, ఇంటిలో డ్రగ్స్‌ పెట్టి అరెస్ట్‌ చేయిస్తానంటూ బెదిరిస్తున్నట్లు నమిత ఫిర్యాదులో తెలిపింది. ఇరువైపుల ఫిర్యాదును తీసుకుని పోలీసులు విచారణ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement